Header Banner

వీడియోలో భారత మ్యాప్ తారుమారు..! యూట్యూబ్ ఛానెల్‌పై తీవ్ర ఆగ్రహం!

  Mon May 19, 2025 20:01        India

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'రియల్ ఇంజినీరింగ్' భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయాలపై ప్రశంసలతో ఒక వీడియోను విడుదల చేసింది. అయితే, 'ది అన్‌లైక్లీ రైజ్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్' పేరుతో వచ్చిన ఈ వీడియోలో భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దేశంలోని కొన్ని కీలక భూభాగాలను మినహాయించి చిత్రీకరించిన ఈ మ్యాప్‌పై భారతీయ వీక్షకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఇది దేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచే చర్యగా వారు ఆరోపించారు.

భారతీయుల నుంచి వ్యతిరేకత రావడంతో, 'రియల్ ఇంజినీరింగ్' ఛానెల్ నిర్వాహకులు స్పందిస్తూ, తాము చూపించిన మ్యాప్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినదేనని, భౌగోళిక రాజకీయ వివాదాలను పరిష్కరించడం తమ బాధ్యత కాదని వాదించారు. అంతేకాకుండా, "ఇకపై భారత్‌ను ప్రశంసిస్తూ తప్పు చేయను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఒక వీక్షకుడి ప్రశ్నకు బదులిస్తూ, "సరిహద్దు వివాదాల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తెలుస్తుంది, ఇవేవీ ముఖ్యం కాదని. సరిహద్దులనేవి కేవలం ఊహించుకున్నవే. ప్రజలు సురక్షితంగా ఉండటమే ముఖ్యం" అని ఛానెల్ నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేసిన సైనికులను, పౌరులను అవమానించేలా ఉన్నాయని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaMapControversy #YouTubeOutrage #ViralVideo #MapError #IndianNews #SocialMediaBacklash